కోర్టులో లీగల్‌ స్టేషనరీ స్టాల్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టులో లీగల్‌ స్టేషనరీ స్టాల్‌

Oct 16 2026 7:29 AM | Updated on Oct 16 2026 7:29 AM

మర్యాదగా ప్రవర్తించాలి వంటావార్పుతో ఆందోళన పోస్టల్‌ ఉద్యోగుల నిరసన పోస్టల్‌ ఓటింగ్‌ 80శాతం పవర్‌కట్‌ ప్రాంతాలు

కరీంనగర్‌క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ ద్వారా ఏర్పాటుచేసిన లీగల్‌ స్టేషనరీ స్టాల్‌ను జిల్లా జడ్జి ఎస్‌.శివకుమార్‌ గురువారం ప్రారంభించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్‌ గడ్డం లక్ష్మణ్‌, వైస్‌ చైర్మన్‌ సీహెచ్‌.కిరణ్‌ కుమార్‌, కార్యదర్శి బెజ్జంకి శ్రీకాంత్‌, సంయుక్త కార్యదర్శి బొడ్ల గీతారాణి, కోశాధికారి సుంకే దేవకిషన్‌, గవర్నమెంట్‌ ప్లీడర్లు కల్వ కోట శ్రీనివాస్‌, గౌరు రాజిరెడ్డి, పూరెల్ల రాములు, రామగిరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

చిగురుమామిడి: పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించా లని సీపీ గౌస్‌ ఆలం సిబ్బందిని ఆదేశించారు. గురువారం చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. జనరల్‌ డైరీ, ఎఫ్‌ఐఆర్‌, పెండింగ్‌ కేసులు, రౌడీషీట్ల రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం ఉండొద్దని, గ్రామాల్లో నిఘా పెంచాలన్నారు. రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, తిమ్మాపూర్‌ సీఐ బి.అనిల్‌, చిగురుమామిడి ఎస్సై బి.జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమ్మె గురువారం మూడో రోజు కొనసాగింది. కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు వంటావార్పు చేపట్టారు. ఆరోగ్యశాఖలో కీలకమైన వైద్యసేవలు అందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. మైనా రిటీ ఉద్యోగుల సంఘం తరఫున అఫ్తాబ్‌ అహ్మ ద్‌ ఖాన్‌ సంఘీభావం ప్రకటించారు. జిల్లా అ ధ్యక్షుడు ఈ.రమేశ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేశ్‌, ఉపాధ్యక్షుడు ఎండీ.ఖలీఖ్‌, ప్రధాన కార్యదర్శి కె.రమేశ్‌, జిల్లా సమన్వయకర్తలు మడుగుల అఖిల్‌, సాగర్‌, కె.రాజు, కె.రవీందర్‌, జి.అనిల్‌ కుమార్‌, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్‌: తమ సమస్యల సాధనకు ఆల్‌ ఇండియా గ్రామీణ పోస్టల్‌ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు గురువారం కరీంనగర్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ ఎదుట గ్రామీణ పోస్టల్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏఐజీడీఎస్‌యూ కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ 8వ వేతనానికి గ్రామీణ తపాలా ఉద్యోగుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో దశలవారీగా పోరాటం కొనసాగుతుందన్నారు. నాయకులు లచ్చన్న, సుగుణాకర్‌, రాజేందర్‌, అప్సర్‌, జగన్‌రెడ్డి, శేఖర్‌, మారుతి పాల్గొన్నారు.

కరీంనగర్‌ టౌన్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్ని కల్లో భాగంగా కరీంనగర్‌ రీజియన్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 80శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 25 ఓట్లకు 20 పోలయ్యాయి. క్లాజ్‌–3లో ఈయూకు 14, టీఎస్‌డబ్ల్యూయూకు 6 ఓట్లు వచ్చాయి. క్లాజ్‌–6లో టీఎంయూకు 11, టీఎస్‌డబ్ల్యూయూకు 9 ఓట్లు నమోదయ్యా యి. ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి.

కొత్తపల్లి: శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.సాయిక్రిష్ణ ఫీడర్‌ పరిధిలోని ముకరంపుర, బస్టాండ్‌, పోలీస్‌ హెడ్‌క్వార్టర్లు, మున్సిపల్‌ కార్యాలయం, జెడ్పీ కార్యాలయం ప్రాంతాలతో పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు, ఐటీ హబ్‌ ఫీడర్ల పరిధిలోని శ్రద్ధ ఇన్‌ హోటల్‌, ఎన్‌టీఆర్‌ విగ్రహం, డీమార్ట్‌, బైపాస్‌, పాలిటెక్నిక్‌ కళాశాల, ఐటీఐ కళాశాల, ఐటీ హబ్‌ ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement