అమిత్‌షా పర్యటనకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

అమిత్‌షా పర్యటనకు పటిష్ట భద్రత

Oct 3 2026 12:44 AM | Updated on Oct 3 2026 12:44 AM

అమిత్‌షా పర్యటనకు పటిష్ట భద్రత ● ఏఎస్‌ఎల్‌ సమావేశంలో ఏర్పాట్లపై సీపీ గౌస్‌ ఆలం సమీక్ష

కరీంనగర్‌క్రైం: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కరీంనగర్‌ పర్యటన నేపథ్యంలో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. అక్టోబర్‌ 4న ప్రతిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో నిర్వహించనున్న సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు అమిత్‌షా హాజరు కానున్న నేపథ్యంలో అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌(ఏఎస్‌ఎల్‌) సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హోం మంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్‌, సభావేదిక, పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, కార్యక్రమ ప్రదేశాల వద్ద భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భద్రతా విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీపీ సూచించారు. ప్రతీ ప్రాంతాన్ని ముందుగానే సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిమ మెడికల్‌ కాలేజీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలతోపాటు ప్రతిమ డీమ్డ్‌ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, సిల్వర్‌ జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ, ఫొటో ఎగ్జిబిషన్‌, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, ప్రతిమ మెడికల్‌ సైన్సెస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement