కరీంనగర్: క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్ వృద్ధులకు సూచించారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ వృద్ధులు, దివ్యాంగుల వసతి గృహంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ ఎస్.శివకుమార్ అనుమతితో శిబిరం చేపట్టా రు. జడ్జి యశ్వంత్‌సింగ్ మాట్లాడుతూ, వృద్ధు ల హక్కులు, సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు న్యాయ సేవా సంస్థ ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. జిల్లా వైద్యాధికారి రాజగోపాల్‌రావు, న్యాయవాది కిరణ్‌కుమార్, ఎలుగు తణ్మయి, శ్రీపతి భావన, డాక్టర్లు విప్లవశ్రీ, ఇమ్రాన్‌ఖాన్, వార్డర్ ఎం.రాధిక, నర్సింగ్ ఆఫీసర్ తోట సృజన, వైద్యులు హారిక, మొహ్మమద్ ఆరీఫ్, టి.సాయిదీప్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేస్తాం
గంగాధర: మండలంలోని నారాయణపూర్ గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు పది శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ చిత్రామిశ్రా తెలిపారు. నారాయణపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఎలాంటి అపోహ, ఆందోళనకు గురికావద్దన్నారు. రిజర్వాయర్ ప్రభావం, ముంపు పరిస్థితులు, భూసేకరణ, సాగుభూములు, ఇళ్లు, ప్రజాసౌకర్యాలపై పరిశీలిస్తామని తెలిపారు. సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. సమస్యను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్: ఎస్‌ఐఆర్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న 25వేల నోటీసులు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫు ల్ దేశాయ్ ఆదేశించారు. బీఎల్‌వోలు ఇంటింటికెళ్లి సర్టిఫికెట్లు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సర్ నోటీసుల పరిష్కార ప్రక్రియలో భాగంగా గురువారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో సమావేశమయ్యారు. కరీంనగర్ నియోజకవర్గంలో రెండో దశ సర్ ప్రక్రియలో మొత్తం 93వేల నోటీసులు జారీ చేయగా.. 25వేలు హియరింగ్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలి పారు. వీటిని వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతీరోజు 30 నోటీసుల డాక్యుమెంట్ సేకరించి, అప్‌లోడ్ చేయాలన్నారు. కొత్తపల్లి, రూరల్ మండలాల బీఎల్వోలు సంబంధిత తహసీల్దార్ ఆఫీస్‌లో ఆన్‌లైన్ నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు రాజేశ్, నర్సింగరావు, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దీన్, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట పత్తి మార్కెట్‌కు మూడు రోజుల సెలవు
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు ఉంటాయని చైర్ పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం , కార్యదర్శులు మల్లేశం, రాజా తెలిపారు. శుక్రవారం గాంధీ జయంతి, శని ,ఆదివారం సెలవులని వివరించారు. సోమవారం యాధావిధిగా క్రయ విక్రయాలు కొనసాగాయని పేర్కొన్నారు. కాగా.. గురువారం క్వింటాల్ పత్తి రూ. 8,021 పలికిందని వారు తెలిపారు.


