మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతాం

Oct 2 2026 3:03 AM | Updated on Oct 2 2026 3:03 AM

మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతాం ● కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ● తీగలగుట్టపల్లిలో అభివృద్ధిపనులకు శ్రీకారం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ నగరాన్ని మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. తీగలగుట్టపల్లి పరిధిలోని రెండో డివిజన్‌ చంద్రపురికాలనీలో యూఐడీఎఫ్‌ నిధులు రూ.65.30లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ పైప్‌లైన్‌, సీసీరోడ్డు పనులకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నిధులతో అన్ని డివిజన్‌లలో వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. చంద్రపురికాలనీలో మరో రూ.30 కోట్లతో పనులు చేపడతామన్నారు. అనంతరం జెడ్పీ పాఠశాలలో స్మార్ట్‌సిటీ నిధులు రూ.1.05 కోట్లతో ఆధునీకరించిన డైనింగ్‌హాల్‌, స్టేజీ సౌకర్యాలను ప్రారంభించారు.

అంగన్‌వాడీ మిలన్‌ సేవా సందడి

తీగలగుట్టపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో సంకల్ప అభియాన్‌లో భాగంగా నిర్వహించిన అంగన్‌వాడీ మిలన్‌ సేవా కార్యక్రమంలో సంజయ్‌ పాల్గొన్నారు. పోషకాహార స్టాళ్లను పరిశీలించారు. సేవలో ప్రతిభను కనపరిచిన అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లను సన్మానించారు. ఆసరా ప్రాణదాతల అవార్డులను ప్రదానం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, సీడీపీవో కవిత, బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిని మల్లేశం, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, కార్పొరేటర్లు వీపీఎన్‌ చంద్ర, సాదినేని లావణ్య, బోయినపల్లి ప్రవీణ్‌రావు, భూపతి రవీందర్‌, ఎన్నం లక్ష్మి, గాజ రమ, గణేశ్‌, బారి జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement