● ప్రతిమ మెడికల్‌ కళాశాల సిల్వర్‌జూబ్లీ వేడుకలకు హాజరు ● ఏర్పాట్లు పరిశీలించిన కేంద్రమంత్రి సంజయ్‌ ● సీపీ గౌస్‌ఆలం, కళాశాల యాజమాన్యంతో సమావేశం | - | Sakshi
Sakshi News home page

● ప్రతిమ మెడికల్‌ కళాశాల సిల్వర్‌జూబ్లీ వేడుకలకు హాజరు ● ఏర్పాట్లు పరిశీలించిన కేంద్రమంత్రి సంజయ్‌ ● సీపీ గౌస్‌ఆలం, కళాశాల యాజమాన్యంతో సమావేశం

Oct 2 2026 3:03 AM | Updated on Oct 2 2026 3:03 AM

● ప్రతిమ మెడికల్‌ కళాశాల సిల్వర్‌జూబ్లీ వేడుకలకు హాజరు ● ఏర్పాట్లు పరిశీలించిన కేంద్రమంత్రి సంజయ్‌ ● సీపీ గౌస్‌ఆలం, కళాశాల యాజమాన్యంతో సమావేశం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ శివారు నగునూరులోని ప్రతిమ మెడికల్‌ కళాశాలను ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 4న నిర్వహించే సిల్వర్‌జూబ్లీ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరవుతున్నారు. ప్రతిమ డీమ్డ్‌ యూనివర్సిటీ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. గురువారం ప్రతిమ మెడికల్‌ కళాశాలలో అమిత్‌షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ పరిశీలించారు. సీపీ గౌస్‌ అలం, కళాశాల చైర్మెన్‌ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డెప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ ఈ నెల 4న జరిగే సిల్వర్‌జూబ్లీ వేడుకలకు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా హాజరవుతున్నారన్నారు. అమిత్‌షా ఈ నెల 3న రాత్రి 9గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మరుసటి రోజు 4న మధ్యాహ్నం 2గంటలకు హెలిక్యాప్టర్‌ ద్వారా కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలకు చేరుకుంటారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొని సాయంత్రం 4.30గంటలకు హైదరాబాద్‌ వెళ్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement