కరీంనగర్: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌కు చెందిన ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 30 మంది రక్తదాతలను సన్మానించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపికృష్ణ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అత్యవసర సమయాల్లో నిస్వార్థంగా పలుమార్లు రక్తదానం చేసిన దాతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ఆసరా ప్రాణదాత–2026 జిల్లాస్థాయి అవార్డులు అందజేసి సత్కరించారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు దాతలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి గొల్లె తిరుపతి, సభ్యులు ఎం. రవిచందర్, ఎస్. నిఖిల్, పి. సంతోష్, ఎస్. అద్వైత్ తదితరులు పాల్గొన్నారు.


