● పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో హాల్టింగ్
రామగుండం: బతుకమ్మ, దసరా, దీపావళి, చాత్ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈనెల 4 నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపించనుంది. ఇందులో చర్లపల్లి–దానాపూర్(07049/50), చర్లపల్లి–ఎస్‌ఎంవీటీ బెంగళూరు(07065/66), చర్లపల్లి–సాసారం(07041/42), చర్లపల్లి–నిజాముద్దీన్(07021/22), చర్లపల్లి–ఢిల్లీ(07023/24) ఉన్నాయి. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, బల్హర్షా, ఇటార్సీ, జబల్‌పూర్, కత్నీ, మైహర్, సత్నా, ప్రయాగ్‌రాజ్ చియోకీ, పీడీడీ ఉపాధ్యాయ, బక్సర్, ఎరా రైల్వేస్టేషన్లలో వీటికి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. అదేవిధంగా చర్లపల్లి–గోరఖ్‌పూర్(22075)వీక్లి అమృత్ భారత్ రైలుకు పెద్దపల్లి జంక్షన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఇది ప్రతీ శుక్రవారం అర్ధరాత్రి 12.30(శనివారం వేకువాజమున)గంటలకు, గోరఖ్‌పూర్–చర్లపల్లి(22076) ప్రతీ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు పెద్దపల్లి జంక్షన్‌కు చేరుకుంటాయి.


