కరీంనగర్ అర్బన్: ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీవోసీ) ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగా జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్ గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఉద్యోగులు ముఖ్యమంత్రిని కలిసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సంగెం లక్ష్మణరావు, అరవింద్ రెడ్డి, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మిందర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, గంగారపు రమేష్, ప్రసాద్ రెడ్డి, శారద, సరిత ఉన్నారు.


