● గ్యాస్ లీకై వ్యాపించిన మంటలు ● సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
బుగ్గారం: మండలకేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం మ ధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని మూడో అంగన్‌వాడీ కేంద్రంలో మొత్తం 14 మంది చిన్నారులు ఉన్నా రు. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ కేంద్రంలో ఓ చిన్న వంటగది, పిల్లలు అభ్యసించే గది ఉన్నాయి. పల్లెర్ల సరిత అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఎప్పటిలాగే విద్యార్థులకు వంట చేస్తుండగా గ్యాస్ లీకై గది అంతా వ్యాపించాయి. వెంటనే అంగన్‌వాడీ సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను హుటాహుటిన బయటకు పంపించి మంటలను ఆర్పివేశారు. కేంద్రంలోని కొన్ని పుస్తకాలు, ఇతర సామగ్రి కాలిపోయినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నీలిమ తెలిపారు. సెక్టార్ సమావేశం ఉండడంతో ఇతర కేంద్రాల సిబ్బంది కూడా అక్కడే ఉండడంతో మంటలు ఆర్ప డం సులువైంది. చిన్నారులు ఉన్న కేంద్రంలో వంట చేసేందుకు ఉపయోగించే సిలిండర్, గ్యాస్‌పొయ్యిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంలో నిర్లక్ష్యంగా ఉండడంతోనే గ్యాస్ లీకై ప్రమా దం మంటలు వ్యాపించాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.


