గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బస్టాండ్ కాలనీలో నివాసముంటున్న జీడీకే–2వ గని కార్మికుడు గోలి శ్రీనివాస్ ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి ఊరువెళ్లిన సమయంలో తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఐదున్నర తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.3లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. క్లూస్ టీంలు అక్కడకు చేసుకుని వేలిముద్రలను సేకరించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు.


