రైతుల గోస చూడండి | - | Sakshi
Sakshi News home page

రైతుల గోస చూడండి

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

● రాజకీయాలను గంగలో కలిపేయండి ● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

● రాజకీయాలను గంగలో కలిపేయండి ● మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

జ్యోతినగర్‌: ‘రాజకీయాలను గంగలో.. గోదారిలో పడేసుకోండి.. కానీ రైతుల గోసను చూడండిశ్రీ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలో జరిగే రైతు ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లోని వ్యాపారి వేణు మలానిని కలుసుకున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చారాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, వేణు మలాని, ప్రవీణ్‌రావు, మంగీలాల్‌, వొల్లాల సురేశ్‌ తదితరులు పూలమొక్కలు అందించి, శాలువాలతో సన్మానించారు. అనంతరం ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో కనీసం 10 టీఎంసీలను విడుదల చేస్తే లక్షల ఎకరాల్లోని పంటలను కాపాడవచ్చని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయని అన్నారు. సింగరేణి ఓపెన్‌కాస్టులన్నీ కాంట్రాక్టర్ల మయం అయ్యాయని దుయ్యబట్టారు. లాభాల వాటాను తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలను కూడా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ కూడా సింగరేణికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పాల్గొన్నారు.

డబ్బులు పంపించేందుకు సీఎం, మంత్రుల పోటీ

పెద్దపల్లి: భూముల ఆక్రమణలతో వచ్చిన డబ్బును కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి పంపించేందుకు సీఎం, మంత్రులు పోటీపడుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. సుల్తానాబాద్‌ సమీప సుగ్ల్లాంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా.. మంచిర్యాల వెళ్తున్న ఈటల చూసి ఆగి మాట్లాడారు. ఎల్‌ఎండీ, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నీటి లభ్యతపై ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదని విమర్శించారు. సన్నాలకు బోనస్‌ ఎగవేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు కట్కూరి సత్యనారాయణరెడ్డి, కాసగోని నిర్మల, రామగిరి అఖిల్‌, కందుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement