వేములవాడ: వేములవాడ భీమన్నను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వవిప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణారావు, వేముల వీరేశం మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా విప్ ఆదిశ్రీనివాస్ వారికి స్వామివారి శేషవస్త్రం కప్పగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదం అందజేశారు. మున్సిపల్ డిఈవో ప్రతాప్ నవీన్, ఏఈవోలు జయకుమారి, నాగుల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


