సీఈసీ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా చేయాలి

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

● సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి

జగిత్యాల: ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్న జాతీయ ఎన్నికల కమిషన్‌ జ్ఞానేశ్వర్‌ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. జగిత్యాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన ఎన్నికల కమిషన్‌ను బీజేపీ పావులుగా వాడుకుంటోందన్నారు. పశ్చిమబెంగాల్‌లో 80 లక్షల ఓట్లను తొలగించి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆయన వెంట సీపీఐ నాయకులు విశ్వనాథం, రాములు, వెన్న మహేశ్‌, లక్ష్మీ, ఉస్మాన్‌, కిరణ్‌, శ్రీనివాస్‌, శంకరయ్య పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దహనం.. కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు

చందుర్తి (వేములవాడ): సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడుకునేందుకు యత్నించిన ఓ కానిస్టేబుల్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. చందుర్తిలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు మెకిలే విజేందర్‌ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు దిష్టిబొమ్మను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ మహేశ్‌పై దిష్టిబొమ్మ అంటుకున్న నిప్పురవ్వలు పడి నిప్పు అంటుకుంది. తెరుకున్న కానిస్టేబుల్‌ పక్కనే ఉన్న బకెట్‌తో నీళ్లు ప్యాంటుపై చల్లుకోవడంతో ప్రమాదం తప్పి, స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement