బొక్కలవాగు కలుషితం | - | Sakshi
Sakshi News home page

బొక్కలవాగు కలుషితం

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

● పందుల పెంపకంతో మురుగు

● దుర్వాసనతో ప్రజల అవస్థలు

● బతుకమ్మ వేడుకలకూ అవరోధం

రామగిరి: అది కల్వచర్ల గ్రామస్తుల జీవనంతో ముడిపడిన బొక్కలవాగు. నిత్యం ఉపయోగపడాల్సిన వాగు.. పందుల పెంపకానికి అడ్డాగా, మురుగు, దుర్వాసనకు నిలయంగా మారింది. పరిసరాల్లో అక్రమంగా షెడ్లు నిర్మించి పందుల పెంపకం చేపట్టడమే ఇందుకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వాగు పక్కనే ఉన్నా..

గ్రామంలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియల తర్వాత వాగులో స్నానం చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం కలుషితమై న నీరు, దుర్వాసనతో కనీసం నీటిలో దిగలేని పరిస్థితి ఉంది.

బతుకమ్మకు అవరోధం..

బతుకమ్మ వేడుకల వేళ సందడిగా కనిపించాల్సిన వాగు.. పందుల కంపుతో దర్శనమిస్తోంది. ఏటా వాగు ఒడ్డున బతుకమ్మ ఆడి, వాయినాలు ఇచ్చుకునే ప్రదేశం ఇది. ఇప్పుడు పందుల పెంపకం, మురుగు, దుర్వాసనతో అపరిశుభ్రంగా మారింది.

భూమి ఆక్రమించి..

వాగు పరిసరాల్లోని పోరంబోకు భూమిని ఆక్రమించి షెడ్లు ని ర్మించడంతోపాటు, బ్రిడ్జికింద నీరు వెళ్లే తూముకు అడ్డంగా ని ర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాలను తొలగించి, వాగు ప్రవాహానికి అడ్డంకులు తొలగించడంతోపాటు నీటికాలుష్యాన్ని అరికట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement