అండర్–19 చెస్ విజేతలకు పతకాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–19 ఎస్జీఎఫ్ చెస్ పోటీలు కరీంనగర్‌లోని జీనియస్ చెస్ అకాడమీలో జరిగాయి. పోటీలకు 90 మంది విద్యార్థులు హాజరయ్యారు. బాలబాలికల విభాగంలో అత్యుత్తమంగా రాణించిన ఐదుగురు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బాలికల విభాగంలో జి.దేవిశ్రీ హర్షిని, జె.సహస్ర, జి.హర్షిని, కె.అమూల్య, బాలుర విభాగంలో ఆర్.దీక్షిత్, ఎం.మహదేవ్, ఎస్.చరణ్‌తేజ, సీహెచ్ మోక్షిత్, బి.శరత్‌కుమార్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. గెలుపొందిన క్రీడాకారులకు 41వ డివిజన్ కార్పొరేటర్ నాంపల్లి రేణుక శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్, జీనియస్ చెస్ అకాడమీ చైర్మన్ కంకటి కనకయ్య, సీనియర్ కోచ్, డైరెక్టర్ కంకటి అనూప్‌కుమార్ పతకాలను ప్రదానం చేశారు.


