సంప్రదాయం ప్రకారమే ఆలయ పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయం ప్రకారమే ఆలయ పునరుద్ధరణ

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధమైన శ్రీఉగ్ర నృసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు శాస్త్రం, సంప్రదాయప్రకారంగానే ఉన్నాయని శృంగేరి పీఠాధిపతి జగద్గురు స్వాములు తెలిపారు. ఆలయ పునరుద్ధరణ పనుల అనుమతికి సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ హన్మంతరావు, ఆలయ ఈవో శ్రీనివాస్‌, ధర్మపురి అగ్రహారం శృంగేరి పీఠాధిపతులు జగద్గురు స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ పునర్నిర్మాణంపై వివరించారు. సంబంధిత పత్రాలు వారికి అందించారు. వాటిని పరిశీలించిన స్వాములవారు శాస్త్రం, సంప్రదాయం ప్రకారమే ఉన్నాయని చెప్పినట్లు మంత్రి తెలిపారు. పనులను గోదావరి పుష్కరాలలోపు పూర్తి చేయాలని, పుష్కరాల అనంతరం ఇదే రీతిలో యోగలక్ష్మీనృసింహస్వామి ఆలయ పునరుద్ధరణ చేపట్టాలని సూచించారని పేర్కొన్నారు. అనంతరం పీఠాధిపతికి మంత్రి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. వేద పండితులు బాచంపెల్లి సంతోష్‌శర్మ, ఆలయ అర్చకులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement