ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన అండర్–14, 17 బాలబాలికల రెజ్లింగ్ పోటీలను పోటీల కన్వీనర్ జిట్టబోయిన్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. రాణించిన క్రీడాకారులను 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల రెజ్లింగ్ పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు.
ముగిసిన వాలీబాల్ పోటీలు
అండర్–19 కళాశాలల బాలబాలికల వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ కళాశాలలో పోటీలు జరగగా.. సుమారు 40కి పైగా కళాశాలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సిలాల్, సతీశ్, బల్వీందర్ సింగ్, అశోక్, శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు.


