12వ జిల్లాస్థాయి సబ్ జూనియర్, 20వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్ కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడాపాఠశాలలో ఉత్సాహంగా సాగింది. అండర్–14, 16 బాలబాలికల విభాగాల్లో రన్స్, జంప్స్, త్రోస్ అంశాల్లో పోటీలను నిర్వహించారు. కరీంనగర్ ట్రాఫిక్ సీఐ అంజయ్య ప్రారంభించారు. గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర టీజీపీఈటీఏ కార్యదర్శి నాగరాజ్‌గౌడ్ పతకాలను ప్రదానం చేశారు. రాణించిన క్రీడాకారులను ఆసిఫాబాద్, హైదరాబాద్‌లలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, సుమన్ కళ్యాణ్, పీడీ, పీఈటీలు బెజ్జంకి రాజగోపాల్, సతిని రమేశ్, టి.హరికిషన్ పాల్గొన్నారు.


