ఈనెల 30న రిటైర్డ్ కాబోతున్న సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ జూడో కోచ్ ఎల్వీ రమణను కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జరిగిన అండర్–14, 17 ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ఘనంగా సత్కరించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సిలాల్, పీడీ, పీఈటీలు అంతటి శంకరయ్య, సత్యనారాయణ, సిలివేరి మహేందర్, గోలి సుధాకర్, కోచ్‌లు సాయిరాంయాదవ్, శ్యాంకుమార్ పాల్గొన్నారు.


