అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Sep 29 2026 12:27 AM | Updated on Sep 29 2026 12:27 AM

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌళిక వసతుల కల్పనకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. హ్యాంరోడ్ల పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ సమైక్య భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన పనుల్లో వేగం పెరగాలన్నారు. వీబీజీ రామ్‌జీ ద్వారా లింక్‌ రోడ్ల నిర్మాణాలపై నివేదికలు ఇవ్వాలన్నారు. పరిపాలనా అనుమతులు పొంది 60 రోజుల కంటే ఎక్కువ సమయం ముగిసినా ఇంకా పనులు ప్రారంభించని అంశాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రహదారి పనుల ప్రతిపాదనలను రెండు కేటగిరీలుగా విభజించాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన మట్టి, లింక్‌ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడంతోపాటు ఉపాధి హామీ కింద నిర్మించే రోడ్ల పనులుగా విభజించాలన్నారు.

భూగర్భ జలాల పెంపు కోసం..

భూగర్భ జలాలను పెంచేందుకు జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని దానకిషోర్‌ ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊటకుంట తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా పథకాల ద్వారా ప్రజలకు నిరంతరాయంగా పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలన్నారు. పైప్‌లైన్లు, పంపింగ్‌ వ్యవస్థల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్‌ శ్రీలక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ఈఎన్సీ జగదీశ్‌, కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, పంచాయతీరాజ్‌, పది జిల్లాల నుంచి అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫర శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూగర్భజలాల వృద్ధికి చర్యలు చేపట్టాలి

కామారెడ్డిలో పది జిల్లాల అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement