కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో సోమవారం గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న బుర్ర వంశీ(24) అనే యువకుడిని అరెస్టు చేసినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో మొగ్ధుంపూర్ శివారులోని మైత్రి దాబా వద్ద అనుమానాస్పదంగా తెల్లటి ప్లాస్టిక్ కవర్‌తో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని కవరు విప్పి చూడగా గంజాయి కనిపించడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. నిందితుడి వద్ద నుంచి కిలో 140 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయికి అలవాటు పడిన వంశీ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాకు వెళ్లి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని అన్నారు. నిందితుడు వంశీపై పెద్దపల్లి జిల్లా రామగిరి, కరీంనగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్, ఒడిశా రాష్ట్రంలో గంజాయికి సంబంధించిన కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడని వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి చట్టప్రకారమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.


