కోనరావుపేట(వేములవాడ): తుల దాడిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన ఎరుకల భూదవ్వ(80) ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది. సోమవారం ఉదయం హఠాత్తుగా కోతుల గుంపు దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్‌లో సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు.
లారీ డ్రైవర్‌పై కేసు
జ్యోతినగర్: ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి సెంటర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి అరుణ్‌కుమార్ మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ రామగుండంకు చెందిన పులి కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాలు
వేములవాడ: గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు ఉన్నట్లు జీటీఎం ప్రతినిధి సతీశ్‌రావు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఉచిత వీసా, విమాన టికెట్ అందిస్తారన్నారు. జీటీఎం ఇంటర్నేషనల్ విభాగంలో మెయింటనెన్స్ డివిజన్ ఎంఈపీ సూపర్‌వైజర్, ఎంఈపీ టెక్నిషియన్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఈడీ 1,740 నుంచి ఏఈడీ 4,500 వరకు వేతనం లభించే అవకాశం ఉందన్నారు. ఉచిత వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల యువకులు అక్టోబర్ 6న సికింద్రాబాద్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 040–40071515, 040–42029999, 8332052299లలో సంప్రదించాలని కోరారు.


