భూ విక్రయం పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

భూ విక్రయం పేరుతో మోసం

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

కరీంనగర్‌రూరల్‌: వ్యవసాయ భూమి విక్రయం పేరుతో తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ నాటకమాడి మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు రషీదా తబుస్సమ్‌, షకీల్‌ అహ్మద్‌ ఆదివారం కరీంనగర్‌లో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ విలీనగ్రామం బొమ్మకల్‌ రజ్వీచమన్‌కు చెందిన రషీదా తబుస్సమ్‌ వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు కృష్ణానగర్‌కు చెందిన అలీమ్‌, జబ్బార్‌లను సంప్రదించింది. బెజ్జంకి మండలం శనిగరంలో 7గుంటల భూమి ఉందని చెప్పడంతో గతేడాది డిసెంబరులో రూ.5లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించింది. భూమి రిజిస్ట్రేషన్‌ చేయకుండా జాప్యం చేస్తుండటంతో తబుస్సమ్‌ గట్టిగా నిలదీసింది. బెజ్జంకి తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో కుమ్మకై ్కన అలీమ్‌, జబ్బార్‌ భూమి రిజిస్ట్రేషన్‌ పేరిట నాటకమాడారు. జూలైలో తబుస్సమ్‌ వద్ద నుంచి మిగితా డబ్బులు రూ.24లక్షలు తీసుకుని తబుస్సమ్‌ ఫొటోలు, వేలిముద్రలను సేకరించి రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని, వారం రోజుల్లో డాక్యుమెంట్‌ వస్తుందని నమ్మించారు. పదిరోజులు గడిచినా డాక్యుమెంట్‌ రాకపోవడంతో ఆన్‌లైన్‌లో పరిశీలించగా వివరాలు కనిపించలేదు. మోసపోయినట్లు గుర్తించి అలీం, జబ్బార్‌పై శనివారం కరీంనగర్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది కుమ్మక్కు

నకిలీ భూమి రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో బెజ్జంకి తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది అలీంతో కుమ్మకై ్క నాటకమాడినట్లు తబుస్సమ్‌ ఆరోపిస్తోంది. పట్టాదారుగా జబ్బార్‌ వ్యవహరించి సంతకాలు చేశాడని, తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ తాత్కాలిక ఉద్యోగి రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడని వివరించింది. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని కోరారు.

సిద్దిపేట జిల్లా బెజ్జంకి తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ నాటకం

కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement