చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా.. | - | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా..

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

● బీజేపీ– కాంగ్రెస్‌ ఘర్షణ ● పరస్పరం తోపులాట, అడ్డుకున్న పోలీసులు

కరీంనగర్‌: ఐలమ్మ జయంతి వేడుకలు రాజకీయ వివాదంతో రసాభాసగా మారాయి. ప్రతిమ చౌరస్తాలో శనివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఐలమ్మ విగ్రహం సాక్షిగా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఘ ర్షణతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్న కార్యక్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరై ఐలమ్మకు నివాళి అర్పించి తిరిగి వెలుతున్న క్రమంలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీశాయి. జయంతి వేడుకల ఏర్పాట్లలో టెంట్లు, కుర్చీలు, మంచినీటి సౌకర్యాలు కల్పించలేదని అప్పటికే అసంతృప్తిగా ఉన్న బీజేపీ, రజక సంఘం నాయకులు, మంత్రి వచ్చి దండలు వేసి నివాళులర్పించి ఎలాంటి ప్రసంగం చేయకుండా వెళ్లిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ కార్యకర్త ‘మంత్రి ఏం మాట్లాడాలి’ అంటూ ప్రశ్నించడంతో బీజేపీ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణతో పాటు తోపులాటకు దారితీసింది. పోలీసులు, ఇతర నాయకులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. కొత్తపల్లికి చెందిన జెరిపోతుల వాసు ఫిర్యాదు మేరకు ఈశనపల్లి మహేశ్‌, ఉప్పరపెల్లి శ్రీనివాస్‌, మరికొందరిపై వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement