పెట్రోల్‌లో నీళ్లు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌లో నీళ్లు

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

● బంకు నిర్వాహకులపై వాహనదారుల ఆగ్రహం

తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో శుక్రవారం పెట్రోల్‌కు బదులు నీళ్లు పోశారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు. అఖిల్‌ అనే యువకుడు తన బైక్‌లో రూ.200 విలువైన పెట్రోల్‌ను పోయించుకున్నాడు. బంకు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వాహనం ఆగిపోయింది. అనుమానం వచ్చిన వాహనదారుడు ట్యాంక్‌లోని ఇంధనాన్ని బాటిళ్లలోకి తీసి చూడగా అందులో సగానికి పైగా నీరు కలిసి ఉండటం కనిపించింది. వెంటనే అతడు బంకు వద్దకు చేరుకుని నిర్వాహకులను నిలదీశాడు. అక్కడికి చేరుకున్న ఇతర వినియోగదారులు కూడా బంకు యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కల్తీ పెట్రోల్‌ కారణంగా తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి బంకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుళ్లకు గాయాలు

కరీంనగర్‌క్రైం: గణేశ్‌ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లను కారు ఢీకొనడంతో గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఆదర్శనగర్‌ బోర్డు వద్ద నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు విధులు నిర్వహిస్తున్న కరీంనగర్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు శివకుమార్‌, రాజరత్నం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. చొప్పదండి వైపు వెళ్తున్న క్రెటా కారు వారిని ఢీకొట్టింది. కారు డ్రైవర్‌ గాసికంటి అరవింద్‌ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శివకుమార్‌, రాజరత్నం తల, కాళ్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డ్రంకెన్‌డ్రైవ్‌ పరీక్షలో డ్రైవర్‌ మద్యం తాగినట్లు తేలిందని పోలీసులు నిర్ధారించారు. టౌన్‌ ఏసీపీ వెంటకస్వామి, సీఐ తిరుమల్‌ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement