బాలుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

బాలుడి మృతదేహం లభ్యం

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన తాండ్ర అహాన్‌చంద్ర (16) గురువారం వేకువజామున వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు మల్కాపూర్‌ ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతుకాగా.. బాలుడి మృతదేహాన్ని శుక్రవారం కొత్తపల్లి పోలీసులు చింతకుంట శివారులోని మానేరు డ్యాంలో గుర్తించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్‌ తెలిపారు.

కేంద్ర మంత్రి ఆర్థికసాయం

అహాన్‌రుద్ర కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ శుక్రవారం కలెక్టర్‌ చిత్రా మిశ్రాను ఫోన్‌లో కోరారు. బాలుడి అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ.25 వేలు ఆయన కుటుంబ సభ్యులకు పంపించారు. బాలుడి మృతదేహం లభించిన ప్రాంతానికి మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వెళ్లారు. ఎస్సై సాంబమూర్తి సిబ్బందితో కలిసి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement