నిమజ్జనం వేళ.. విషాదం | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనం వేళ.. విషాదం

Sep 25 2026 1:59 AM | Updated on Sep 25 2026 1:59 AM

నిమజ్జనం వేళ.. విషాదం

కొత్తపల్లి(కరీంనగర్‌): వినాయక నిమజ్జనం వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం బద్ధిపల్లి గ్రామానికి చెందిన తాండ్ర అహన్‌రుద్ర (16) ప్రమాదవశాత్తు మల్కాపూర్‌ ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతయ్యాడు. గురువారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు బద్ధిపల్లి గ్రామస్తులు ఎస్సారెస్పీ కాలువ వద్దకు చేరుకున్నారు. ట్రాక్టర్‌ ట్రాలీ డోర్‌ తీస్తున్న క్రమంలో అహన్‌రుద్ర ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డాడు. నీటి ప్రవాహం ఉధృతి అధికంగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం, ఏసీపీ విజయ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ బిల్లా కోటేశ్వర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అహన్‌రుద్ర ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న బాలుడు గల్లంతవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఎండపల్లిలో కరెంట్‌ షాక్‌తో...

వెల్గటూర్‌: విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం కొత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొప్పుల రాజశేఖర్‌ (23) బుధవారం రాత్రి గణేశ్‌ నిమజ్జనం వేడుకల్లో భాగంగా సౌండ్‌ బాక్స్‌లకు విద్యుత్‌ సరఫరా చేసే మెయిన్‌ వైర్లను కర్రతో సరిచేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడి తల్లి కొప్పుల నీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

కేసు భయం..

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని మల్యాలకు చెందిన పొన్నం అంజయ్యగౌడ్‌(40) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంజయ్య కాల్వశ్రీరాంపూర్‌లో ఆవులు దొంగతనం చేసినట్లు బాధితులు కాల్వశ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 14న ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామానికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న అంజయ్యగౌడ్‌ పురుగుల మందు చెవిలో పోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు కాల్వశ్రీరాంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్సై గట్ల సుధాకర్‌ను వివరణ కోరగా అంజయ్యగౌడ్‌ ఆవులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని, ఇంట్లోనే ఉండి తలుపులు వేసుకుని ఫోన్‌ స్విచాఫ్‌ పెట్టుకున్నాడని, పోలీసులు వేధిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్సై తెలిపారు.

అహన్‌రుద్ర(ఫైల్‌)

రాజశేఖర్‌(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement