జమ్మికుంట: 9.5 సెం.మీలు
కరీంనగర్ అర్బన్: 4.3 సెం.మీలు
ఇల్లందకుంట: 4.0 సెం.మీలు
కరీంనగర్ రూరల్: 3.0 సెం.మీలు
గన్నేరువరం: 2.8 సెం.మీలు
తిమ్మాపూర్: 2.4 సెం.మీలు
కొత్తపల్లి: 2.3 సెం.మీలు
మానకొండూరు: 2.2 సెం.మీలు
సైదాపూర్: 2.0 సెం.మీలు
కరీంనగర్ అర్బన్: ఎడతెరిపి లేని వాన తటాకాలను మరిపించింది. పల్లె, పట్నం తేడా లేకుండా ఎటూ చూసినా జలమయమే. గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షం దంచి కొడుతుండగా చెరువులు జలకళను సంతరించుకోగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. దిగువ మానేరు, ఇతర జలాశయాలు ఆశాజనకంగా మారాయి. అత్యధికంగా జమ్మికు ంట,చొప్పదండి మండలాల్లో 9.5 సెం.మీల వర్షపా తం నమోదైంది. కరీంనగర్ అర్బన్, ఇల్లందకుంట, కరీంనగర్ రూరల్, గన్నేరువరం, హుజూరాబా ద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల్లో 6 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదైంది.
నిండిన చెరువులు.. ఆశాజనకంగా జలాశయాలు
జిల్లావ్యాప్తంగా కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లుండగా 1,376 చెరువులున్నాయి. దిగువ మానేరు జలాశయం, శనిగరం ప్రాజెక్టు, మధ్యమానేరు జలాశయాల్లో ఆశాజనకంగా నీరు చేరగా భారీగా వస్తున్న వరద నీటితో చెరువులు, కుంటలు నిండడంతో యాసంగి పంటలకు ఢోకా లేదని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కెనాల్, వరదనీటి కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకునే దశకు చేరింది.
ఏటా పత్తికి తీవ్ర నష్టం.. వరికి భరోసా
తెల్లబంగారాన్ని పండించే రైతులకు ఈ సారి గడ్డురోజులేనని స్పష్టమవుతోంది. అవసరమైన సమయంలో కాకుండా అకాలంలో తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పంటపై తెగుళ్లు దాడి చేయనుండగా పైరు ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. జిల్లాలో రెండే ప్రధాన పంటలు వరి, పత్తి కాగా పత్తి పూతకు రాగా పూత రాలిపోతుంది. 60వేల ఎకరాల్లో పత్తి సాగు కాగా నల్లరేగడి నేలలో పంట ఎదగలేదు. చెలక, నల్లరేగడి భూముల్లో మొక్కలు ఎర్రబడ్డాయి. అంతేకాకుండా గడ్డి విపరీతంగా పెరిగిపోవడం, మొక్కలకు వేరు తెగులు, పూత, కాత రాలిపోవడం వంటి తెగుళ్లు ఉధృతమయ్యాయి. సాగైన పంటలో 45శాతం వరకు తెగుళ్లు వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. పైరు ఎదుగుదల లేకపోవడం, పూత రాలిపోతుండటంతో దిగుబడులు సగానికి తక్కువగా వచ్చే అవకాశముంది. ఇక అపరాలది అదే పరిస్థితి. వరి పంటకు సమృద్ధిగా నీరు లభించినట్లయింది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షంతో భుగర్భ జలమట్టం పెరిగింది.


