కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో 2,252 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో అత్యధికంగా మానకొండూరు చెరువులో, ఆ తరువాత చింతకుంట కెనాల్‌లో విగ్రహాలు నిమజ్జనమయ్యాయన్నారు. గురువారం తెల్లవారుజాము వరకు నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి అయ్యేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ప్రారంభమైన గణేశ్ నిమజ్జన ఉత్సవాలు గురువారం రాత్రి వరకు కొనసాగాయని తెలిపారు. నగరపాలక సంస్థ సిబ్బంది, కార్మికులు, అధికారులు భారీవర్షాన్ని లెక్కచేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించడంపట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్మికులు ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహించి, చెత్తను తరలించారన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నుంచి నిమజ్జన పాయింట్లల్లో శిథిలాల తొలగింపు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పాయింట్ల వారీగా నిమజ్జనం అయిన విగ్రహాల (5 ఫీట్ల పైబడి) సంఖ్య
మానకొండూరు: 850
చింతకుంట: 740
కొత్తపల్లి: 550
బొమ్మకల్: 62
గోపాల్‌పూర్: 30
దుర్శేడ్ : 20
మొత్తం : 2,252


