జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎలక్ట్రాన్ క్విజ్ ప్రాంతీయ రౌండ్ చైన్నెలోని ఎంఎంఏ ఆడిటోరియంలో బుధవారం ఉత్సాహభరితంగా సాగింది. ప్రాథమిక రౌండ్‌లో ఇద్దరు సభ్యులతో కూడిన 230 జట్లు పోటీపడగా.. ఆరుజట్లు గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. గ్రాండ్ ఫైనల్‌లో ఐఐటీ మద్రాస్ జట్టు విజేతగా నిలిచింది. మరో ఐఐటీ మద్రాస్ జట్టు రన్నరప్‌గా నిలవగా.. రాజలక్ష్మి ఇంజినీరింగ్ కళా శాల జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. ప్రము ఖ క్విజ్‌మాస్టర్ గౌతమ్‌బోస్ క్విజ్ నిర్వహించారు. ఎన్టీపీసీ ఈడీ (హెచ్‌ఆర్), రీజినల్ హెడ్ ఆఫ్ హెచ్‌ఆర్ (నార్త్–సౌత్) ఎస్‌ఎన్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. విజ్ఞాన ఆధారిత కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. విజేతలకు బహుమతులను అందించారు. ప్రాంతీయ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు 2026 అక్టోబర్ 7న న్యూఢిల్లీలో జరిగే సెమీస్‌కు అర్హత సాధించాయి.


