గనిలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న జట్టు
ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తున్న మహిళా సభ్యులు
గనిలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న మహిళా జట్టు
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని–యైటింక్లయిన్‌కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో రెండురోజుల పాటు నిర్వహించే రెస్క్యూ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెస్క్యూ బృందాలు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా బొగ్గు గనిలో జరిగే ప్రమాదాల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించి సకాలంలో పైకి తీసుకొచ్చే ప్రక్రియ హైలెట్‌గా నిలిచింది. థియరీ, ఫస్ట్‌ఎయిడ్ టెస్ట్‌లు మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో నిర్వహించగా, రెస్క్యూ, రికవరీ పోటీలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేసిన జీడీకే–7ఎల్‌ఈపీ గనిపై కొనసాగాయి.


