పిడుగుపాటుకు మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మహిళ మృతి

Sep 24 2026 12:06 AM | Updated on Sep 24 2026 12:06 AM

● అపస్మారక స్థితిలో మరో మహిళ

జూలపల్లి/ధర్మారం: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని బాలరాజుపల్లెలో వ్యవసాయ పనులు వేస్తున్న కూలీలపై పిడుగుపడి మారం అంజయ్య(50) అక్కడికక్కడే మృతి చెందగా, దోనూరు లక్ష్మి(45) తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలు.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లికి చెందిన మారం అంజమ్మ, కొత్తూరుకు చెందిన దోనూరు లక్ష్మితోపాటు మరికొందరు మహిళలు పత్తి కలుపు తీసేందుకు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని బాలరాజుపల్లెకు బుధవారం చేరుకున్నారు. వారు పనుల్లో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో కూలీలు సమపంలోని చెట్టుకిందకు వెళ్లారు. ఈసమయంలోనే చెట్టుపై పిడుగుపడగా మారం అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, దోనూరు లక్ష్మి కాళ్లు, చేతులు కదలకుండాపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. లక్ష్మిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ మల్లేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చామనపల్లి సర్పంచ్‌ భర్త కొమ్మ నాగరాజు, బాలరాజుపల్లె సర్పంచ్‌ కుంటూరి అంజమ్మ కూలీల వద్దకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement