సౌత్‌జోన్‌ స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపిక

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

సౌత్‌జోన్‌ స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపిక

హుజూరాబాద్‌: పట్టణాని కి చెందిన యువ స్విమ్మర్‌ రిమోన్‌ జాతీయస్థాయి దిశగా అడుగు వేశాడు. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ నెల 15 నుంచి 18వరకు నిర్వహించనున్న సీబీఎస్‌ఈ సౌత్‌జోన్‌ స్వి మ్మింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్‌–14 విభాగంలోని 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పోటీ పడనున్నాడు. పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్‌ 12న కోచ్‌తో కలిసి వరంగల్‌ నుంచి రైలులో తిరునెల్వేలికి బయలుదేరాడు. ఇటీవల ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్విమ్మింగ్‌ పోటీల్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించి సౌత్‌జోన్‌ పోటీలకు అర్హత సాధించాడు. స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధంతో సీబీఎస్‌ఈ ఈ పోటీలను నిర్వహిస్తోంది.

చదువులోనూ.. క్రీడల్లోనూ రాణింపు

హన్మకొండ భీమారంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రిమోన్‌ చదువులోనూ ప్రతిభ కనబరుస్తూ తరచూ మొదటి ర్యాంక్‌ సాధిస్తున్నాడు. చిన్నతనం నుంచే ఈతపై ఆసక్తి ఉండటాన్ని గమనించిన తాత చందా గాంధీ అతడిని హుజూరాబాద్‌ క్లబ్‌ స్విమ్మింగ్‌ పూల్‌కు తీసుకెళ్లి ప్రోత్సహించారు. ప్రస్తుతం స్విమ్మింగ్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ రిమోన్‌ ప్రతిభ చూపుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement