అదుపు తప్పిన ట్రాక్టర్‌.. ఒకరికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన ట్రాక్టర్‌.. ఒకరికి తీవ్రగాయాలు

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

శంకరపట్నం: మండలంలోని తాడికల్‌ నేషనల్‌ హైవే– 563 బ్రిడ్జి క్రింద ఆదివారం ట్రాక్టర్‌ అదుపుతప్పింది. కేశవపట్నం గ్రామానికి చెందిన పాశం జశ్వంత్‌ (14) తీవ్రంగా గాయపడ్డాడు. కేశవ పట్నం మెయిన్‌ రోడ్డుకు చెందిన 16ఏళ్ల లోపు సుమారు 20మంది బాలురు వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు ట్రాక్టర్‌లో బయల్దేరారు. తాడికల్‌ అండర్‌పాస్‌ బ్రిడ్జి కింద ట్రాక్టర్‌ అదుపుతప్పింది. ట్రైలర్‌ ఒకవైపు ఒరిగింది. వాహనంలో ఉన్న జశ్వంత్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మిగతావారు ట్రాక్టర్‌పై నుంచి రోడ్డుపై దూకేశారు. జశ్వంత్‌ను ఈఎంటీ సతీశ్‌రెడ్డి ప్రథమ చికిత్స చేసి 108లో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement