ఉత్సాహంగా చెస్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా చెస్‌ ఎంపికలు

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: యునైటెడ్‌ కరీంనగర్‌ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అండర్‌–15 బాలబాలికల చెస్‌ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పలువురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. బాలుర విభాగంలో కట్టా శ్రీవాస్తవ్‌, వాసుదేవ్‌, విశ్రుత్‌ రామ్‌, కూన సదంజన మన్వీర్‌సింగ్‌ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో సామ సహస్రరెడ్డి, కూన వైష్ణవి, లక్షణ వాత్సల్య రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరిని జిల్లా చదరంగ సమాఖ్య బాధ్యులు అంతగిరి రాజేంద్రప్రసాద్‌, విశ్వనాథ్‌ ప్రసాద్‌, కొప్పర్తి శివయ్య, చీఫ్‌ ఆర్బిటర్‌ ప్రేమ్‌ సాగర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement