కరీంనగర్‌రూరల్/కొత్తపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం సికింద్రాబాద్ డీఆర్‌ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ పర్యటించారు. నిజామాబాద్– పెద్దపల్లి రైల్వేలైన్ పరిధిలోని జగిత్యాల, కొత్తపల్లి, కరీంనగర్, పెద్దపల్లి రైల్వేస్టేషన్లను పరిశీలించారు. ఆయా స్టేషన్లలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కొత్తపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాలని కోరుతూ 18,17 డివిజన్ల కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల కవిత చంద్రశేఖర్ వినతిపత్రం అందజేశారు. స్టేషన్ పేరును కొత్తపల్లి (హవేలీ)గా మార్చాలని, ప్రతి ప్యాసింజర్ రైలును ఇక్కడ ఆపాలని కోరారు. స్పందించిన డివిజనల్ రైల్వే మేనేజర్ సమస్యల పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ ఉన్నారు.


