బల్దియాలో చక్రం తిప్పుతున్న పొరుగు సేవల సిబ్బంది
వివాదాస్పదంగా కొందరు అధికారుల తీరు
ఔట్ సోర్సింగ్ అయినా నిర్వహణ వారి చేతుల్లోనే
పట్టింపు లేని పారిశుధ్యం.. అక్రమాల టౌన్ ప్లానింగ్
వీధి దీపాలకు సామగ్రి కరువు
నేడు బల్దియా సర్వసభ్య సమావేశం
‘కుక్క తోకను ఊపడం సహజం.. తోకే కుక్కను ఊపుతుంటే అది అసాధారణం. కరీంనగర్ నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంచుమించు ఇదే జరుగుతోంది. రెగ్యులర్ అధికారులకు సపోర్ట్‌గా ఉండేందుకు నియమించుకున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆజమాయిషీ.. పై సామెతను తలపిస్తోంది. కొన్ని విభాగాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఔట్‌సోర్సింగ్ అధికారులు ఫైళ్లను ‘చక్కబెడుతుండడం’... ఏకంగా చెక్కులపై సంతకాలు కూడా చేస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. పైగా సదరు ఔట్‌సోర్సింగ్ అధికారులను ఉన్నతాధికారులే కాపాడుతున్న వైనంపై ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు.


