కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో బుధవారం కు రిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కేబుల్ బ్రిడ్జి సర్కిల్‌ను వరద ముంచెత్తింది. ఎగవ నుంచి భారీగా వచ్చిన వర ద దిగివకు వెళ్లలేకపోవడంతో చౌరస్తా పూర్తిగా మునిగిపోయింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. కొన్నిచోట్ల డ్రైనేజీలు సక్రమంగా లేక వరద ఇళ్లు, రోడ్లపైకి వచ్చింది.
కూలిన గుడి గోడ
నగరంలోని 43వ డివిజన్ భగత్‌నగర్‌లోని అంజనాద్రి ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రహరీ కూలిపోయింది. దాదాపు 25 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రహరీ పూర్తిగా తడిసి పక్కనే ఉన్న రోడ్లపై పడడంతో స్థానికులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘటనస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
అప్రమత్తంగా ఉండండి : మేయర్ శ్రీనివాస్
వరుసగా కురుస్తున్న వర్షాలపై నగరపాలకసంస్థ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం నగరంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలు మరో రెండు రోజులపాటు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక యంత్రాంగం, డీఆర్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 98499 06694 నంబర్, స్థానిక కార్పొరేటర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుకు వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు పడాల శ్రీజ అజయ్, పొన్నం లక్ష్మి మొండయ్య, నునా వత్ భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


