ఆయిల్‌పాం సాగు పెంచండి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగు పెంచండి

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

ఆయిల్‌పాం సాగు పెంచండి ● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

– 8లోu

మూడేళ్లలో 173 ప్రమాదాలు.. 58 మంది మృతి

ఎన్‌హెచ్‌–563పై పది బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు

ప్రత్యేక చర్యలు చేపడుతున్న పోలీసులు

ఖోఖో సంరంభం

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ–టెక్నో స్కూల్‌లో మూడు రోజులపాటు జరిగే సీబీఎస్‌ఈ క్లస్టర్‌–7 బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి అండర్‌–14, అండర్‌–17, అండర్‌–19 విభాగాల్లో 155 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

– కరీంనగర్‌ స్పోర్ట్స్‌/కొత్తపల్లి

కరీంనగర్‌ అర్బన్‌: దీర్ఘకాలంగా ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పాం తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయిల్‌పాం సాగుతో కలిగే లాభాలు, ప్రభుత్వ రాయితీలను రైతువేదికలు, గ్రామపంచాయతీల ద్వారా రైతులకు వివరించాలని సూచించారు. సాగుకు ఆసక్తి ఉన్న రైతుల వివరాలు తయారు చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్‌పాం సాగు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే జిల్లాలోనే ఆయిల్‌పాం నర్సరీకి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఏఈవోలకు 25 ఎకరాల చొప్పున టార్గెట్‌ నిర్దేశించి చేరుకునేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నాలుగేళ్లలో 2,640 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటించామని, ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 450 ఎకరాల్లో పంట కోతకు రాగా, 850 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు వివరించారు. ఒక్కో టన్నుకు రూ.23,783 చెల్లిస్తున్నామని, వారం రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నగరపాలక కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎక్కడైనా తాగునీటి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. కార్పొరేషన్‌లో ఇటీవల విలీనమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో నీటి నిల్వలను రోజూ పర్యవేక్షించాలని, డెడ్‌ స్టోరేజ్‌ పరిస్థితి ఏర్పడకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. భగీరథ ఈఈలు రామ్‌కుమార్‌, సందీప్‌కుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement