కరీంనగర్ కార్పొరేషన్: వినాయక చవితి వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో మాట్లాడారు. నగరంలో ఏర్పాటు చేసే అన్ని వినాయక మండపాలకు విద్యుత్ బిల్లులు నగరపాలకసంస్థ చెల్లిస్తుందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నందున, మండపాలకు ఉచితంగా తాగునీటిని అందిస్తామన్నారు. నిమజ్జనం సందర్భంగా టవర్ సర్కిల్‌ను ప్రత్యేక విద్యుత్ దీపాలతో సుందరీకరిస్తామని, టవర్‌సర్కిల్, కమాన్‌చౌరస్తా, రాంనగర్‌లో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నిమజ్జనానికి సరిపడా నీళ్లు ప్రస్తుతం మానకొండూరు చెరువులో ఉన్నాయని, అప్పటి పరిస్థితి ఆధారంగా నీళ్లు ఎక్కడ అందుబాటులో ఉంటాయో అక్కడ నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమవేశంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు ఎన్నం ప్రకా ష్, గాజె శివ, మాసం గణేశ్, ముజీబ్, రవీందర్, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బహుదూర్‌ఖాన్‌పేట వందశాతం పూర్తి ‘సర్’
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేట గ్రామపంచాయతీ సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)లో వందశాతం డిజిటలైజేషన్ పూర్తి చేసి మండలంలో మొదటి పంచాయతీగా గుర్తింపు సాధించింది. గ్రామంలోని పోలింగ్ కేంద్రం–91లో మొత్తం 682 మంది ఓటర్లున్నారు. గత నెల 25 నుంచి అంగన్‌వాడీ టీచరు, బీఎల్‌వో శ్రీలత ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫాంలు పంపిణీ చేశారు. సర్పంచ్ గుర్రం సంధ్య, కార్యదర్శి మహేందర్, బీఎల్‌వో శ్రీలత, సిబ్బంది ఎన్యూమరేషన్ ఫాంలలో ఓటర్ల వివరాలు రాసేందుకు సహకరించారు. మొత్తం 682 మంది ఓటర్లలో 12మంది మృతి, 22మంది ఓట్లను బదిలీ చేసుకోగా డబుల్ ఓట్లు 5 ఉన్నాయి. మొత్తం 643 మంది ఓటర్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
కరీంనగర్: బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘ఫీజుల బకాయి– బీజేపీ లడాయి’ పోస్టర్‌ను శుక్రవారం నగరంలోని ఓ కళాశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు దాదాపు రూ.15వేల కోట్లు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ప్రభుత్వాన్ని విడిచి పెట్టేదిలేదని, నిరంతరం ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. బీజేవైఎం నాయకులు సంగ నరేశ్, నరెడ్ల ప్రవీణ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, నిర్మలారెడ్డి, సునీత, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తక్షణమే రాజీనామా చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీట్‌లో చోటుచేసుకున్న అక్రమాలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుందన్నారు. ఈ ముట్టడి కార్యక్రమానికి రా కుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నాయకులు మాలో తు రాజేశ్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.


