అప్పుడు మా బాల్యం ఆకాశమంత స్వేచ్ఛ
ఇప్పుడు పిల్లల ప్రపంచం మొబైల్‌లో బంధం.
అప్పుడు చెట్ల నీడలో ఆటల సందడి
ఇప్పుడు స్క్రీన్ వెలుగులో ఒంటరి ప్రయాణం.
అప్పుడు గిల్లి, కబడ్డీ, ఖోఖోల సందడి
ఇప్పుడు వీడియో గేమ్స్‌లో విజయాల వేట.
అప్పుడు తాతయ్య కథలు, అమ్మమ్మ పాటలు
ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా మాటలు.
అప్పుడు స్నేహం అంటే హృదయాల కలయిక,
ఇప్పుడు స్నేహం అంటే ఫాలోవర్స్ లెక్క.
అప్పుడు మట్టి వాసనలో పెరిగిన బాల్యం
ఇప్పుడు ఏసీ గదుల్లో బందీ అయిన జీవితం.
అప్పుడు చిన్న బొమ్మలోనే పెద్ద ఆనందం
ఇప్పుడు ఎన్నో వస్తువులున్నా కనిపించని సంతోషం.
కాలం మారింది, ప్రపంచం మారింది,
సాంకేతికతతో జీవితం ముందుకు సాగింది.
కానీ...
మిస్ అవుతున్నాం ఆ పల్లె గాలిని
మిస్ అవుతున్నాం ఆ స్నేహాల తీపిని.
మిస్ అవుతున్నాం చెట్టు నీడలో నవ్వులను
మిస్ అవుతున్నాం అమ్మమ్మ కథల మధుర జ్ఞాపకాలను.
అప్పుడు బాల్యం ఒక అందమైన జ్ఞాపకం
నేటి బాల్యం ఒక కొత్త ప్రపంచం.
రెండింటిలోనూ మంచితనం ఉన్నా
ఆ పాత రోజుల మాధుర్యం మాత్రం మరువలేనిది!
దూపాటి హరిప్రసాద్
షాపూర్‌నగర్,
హైదరాబాద్


