పిల్లల్లారా! బడి పిల్లల్లారా!!
భారత భావి పౌరుల్లారా!!
మీరే రేపటి భారతదేశ పాలకులు
మీరే రేపటి భారత దేశ రక్షకులు
గొప్ప గొప్ప చదువులెన్నో చదవాలి
మీ మేధస్సుతో భరతభూమి వెలగాలి
కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలలు నిజం చేయ ప్రతినబూనాలి
తల్లిదండ్రుల గురువుపెద్దలను గౌరవించాలి
వినయ విధేయత సంస్కారంతో మెలగాలి
పదుగురిలో మీ గొప్పతనం పరిమళించాలి
ఎదుగుతూనే మీరంతా ఒదిగి ఒదిగి ఉండాలి
సత్యం ధర్మం సమతా మమతా మరవద్దు
నీతి నిజాయితీ సేవా నిరతిని విడవద్దు
మంచితనం మానవత్వం విడవకండి
బీదసాదలను ఆదరించడం మరవకండి
కులమతాలు మీ మనసుకు అంటకూడదు
కలనైనా చెడు యోచన చేయకూడదు
మల్లెలాగ మీ అందరి మనసులుండాలి
భరతమాత మీ ప్రతిభచూసి పొంగిపోవాలి
బూర దేవానందం
కవి, రచయిత
సిరిసిల్ల


