గాలి ఓ మా చిరుగాలి | - | Sakshi
Sakshi News home page

గాలి ఓ మా చిరుగాలి

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

గాలి ఓ మా చిరుగాలి

గాలి గాలి ఓ చిరుగాలి

పవనాలుగా నీవిక తేలి

నీవస్తావులే మా ఇంటికి

నచ్చావులే మా కంటికి !

నీ వల్లే మాకు ఊపిరి ఉంది

నీవు లేకుంటే కలుగు ఇబ్బంది

మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు

అవునా కాదా ఇక ఏమంటావు ?

నీ సమాధానం ఇక ఏదైనా

నీవు లేకుండా పోదు పొద్దైనా

ఓ గాలితల్లి మా చిరుగాలి మళ్లీ

నీవు లేక ప్రాణం ఉండదులే మళ్లీ

చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు

అట్లనే చేయకు నీవిక అలుసు

బొగ్గు పులుసు గాలి నీలో ఉంది

దానితో మాకు కలుగు ఇబ్బంది !

గాలి తల్లి మా చిరుగాలి మల్లి

మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి

నీవు లేకుండా ఉండదు ఏ గల్లి

నీవు వస్తేనే బాగుంటుంది మళ్లీ!

గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి

హోరుగాలితో చేయకు లొల్లి

చల్లగా తగిలితే కలుగు హాయి

మెల్లెగ మది ఉప్పొంగు నోయి !

– గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత

కల్వకుర్తి,

నాగర్‌ కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement