కరీంనగర్‌టౌన్: ‘విలీనమే ముద్దు.. ఎన్నికలు వద్దు’ అనే నినాదంతో ఆదివారం ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్– 1 డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఈనెల 2న ఆర్టీసీ అపాయింట్మెంట్ తేదీ ప్రకటించాలని కోరారు. లేకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమం చేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జి.మనోహర్, రాష్ట్ర నాయకుడు ఎస్.వెంకటేశ్వర్లు, జేఏసీ కన్వీనర్ ఎస్.భుజేందర్, కేకే రెడ్డి, జి.మల్లయ్య, ఎన్‌ఎంరెడ్డి, జంపన్న తదితరులు పాల్గొన్నారు.


