కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పా ఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలకు స్పందన వచ్చింది. సుమారు 60 మంది బాలబాలికలు హాజరయ్యారు. అంతకుముందు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ రాజగోపాల్‌చారి హాజరై రన్నింగ్ పోటీలను ప్రారంభించారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర పోటీల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించా రు. కాగా జిల్లాస్థాయిలో రాణించిన క్రీడాకారులను ఈ నెల 11 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా కార్యదర్శి సుమన్ కళ్యాణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


