తుది దశకు కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

తుది దశకు కౌన్సెలింగ్‌

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌, నాన్‌–ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న ధ్రువపత్రాల పరిశీలన తుది దశకు చేరుకుంది. కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌ లైన్‌ కేంద్రంలో జరుగుతున్న కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం స్లాట్‌ బుక్‌ చేసుకున్న 282 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించినట్లు ప్రిన్సిపాల్‌ డి.శోభారాణి తెలిపారు. విద్యార్థులు తమకు కేటాయించిన స్లాట్‌ సమయానికి హాజరై కౌన్సెలింగ్‌ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డీఈవోగా ప్రశాంత్‌రెడ్డి

కరీంనగర్‌టౌన్‌: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీల్లో కరీంనగర్‌ డీఈవోగా ప్రశాంత్‌రెడ్డిని కేటాయించారు. ఇంతకముందు డీఈవోగా అదనపు కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏడీగా విధులు నిర్వహిస్తున్న మాధవిని ఆదిలాబాద్‌ డీఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

డిగ్రీ కోర్సులను బలోపేతం చేయాలి

కరీంనగర్‌సిటీ: డిగ్రీ కోర్సులను బలోపేతం చేసేందుకు నూతన ఒరవడికి శ్రీకారం చుటాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి అన్నారు. ఆదివారం శాతవాహన యూనివర్సిటీ ఆడిటోరియంలో డిగ్రీలో కొత్త సిలబస్‌, కోర్సుల రూపకల్పన అంశంపై రిజిస్ట్రార్‌ సతీశ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుతం మేలైన విద్య అభ్యసించేందుకు కొత్త సిలబస్‌, నూతన పాఠ్యంశాలను తయారు చేసుకోవాలని, రానున్న విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని, అవి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి దోహద పడతాయన్నారు. నౌకారంగం, విమానయాన, ఆరోగ్యరంగాల్లో ఉపాధి అవకాశాలను ఈ కొత్త పాఠ్యాంశాల సాయంతో సొంతంగా సృష్టించుకోవచ్చని తెలిపారు. వీసీ ఉమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ, జిల్లా డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం బాధ్యులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు, సోషల్‌, ట్రైబల్‌, బీసీ, మైనారిటీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ అధ్యాపకులు, డాక్టర్‌ సురేశ్‌కుమార్‌, డీన్‌ సీడీసీ డాక్టర్‌ జాఫర్‌, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమాకాంత్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మావతి పాల్గొన్నారు.

విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలి

కరీంనగర్‌టౌన్‌: తెలంగాణ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులందరూ విధుల్లో బాధ్యతతో వ్యవహరించడంతో పాటు సర్వీస్‌ రూల్స్‌పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారంలో నిబంధనలపై అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు. నోటీస్‌, లెటర్‌ మధ్య ఉన్న తేడాను గుర్తించి తగిన విధంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలను గౌరవప్రదంగా, నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవాలని కోరారు. అలాగే వివిధ రకాల శిక్షలు, వాటి ప్రభావాలపై వివరించారు. సాఽ ద్యమైనంత వరకు పాఠశాల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూ టీ ఈవో పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారి, పి.సత్యనారాయణ, మనోహర్‌, ప్రతాప్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌, భగవంతయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పవర్‌ కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: కరీంనగర్‌లో విద్యుత్‌ స్తంభాల షిఫ్టింగ్‌ పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ వేంకటేశ్వర ఫీడర్‌ పరిధిలోని చందా ఆసుపత్రి, బీజేపీ కార్యాలయం, కెమిస్ట్‌ భవన్‌, శివ థియేటర్‌, వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–1 ఏడీఈ పి.శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement