తల్లి ఆరోగ్యానికి యోగం | - | Sakshi
Sakshi News home page

తల్లి ఆరోగ్యానికి యోగం

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

ప్రయోజనాలు

గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. బరువు పెరగడం, హార్మోన్ల మార్పులు, వెన్నునొప్పి, కాళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని నియంత్రించడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రసవ సమయంలో శరీరం సులభంగా సహకరిస్తుంది. నిద్రలేమి, ఆందోళన తగ్గుతాయి. బీపీ, పిట్స్‌ వంటి సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.

జీవనశైలిపై అవగాహన

యోగా శిక్షణలో కేవలం ఆసనాలకే పరిమితం కాకుండా గర్భిణుల జీవనశైలిపై కూడా ప్రత్యేక దష్టి పెడుతున్నారు. గర్భిణులు ఎలా కూర్చోవాలి? ఎలా పడుకోవాలి? రోజువారీ పనులు తదితర అంశాలపై మోటివేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. చాలామంది గర్భిణులు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం పూర్తిగా మానేయడం, అనవసర భయాలతో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. సరైన అవగాహనతో ఇవి తగ్గించుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement