కరీంనగర్‌సిటీ: ప్రముఖ సాహితీవేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణకు ఆచార్య కళా ప్రపూర్ణ అవార్డు వరించింది. ఆదివారం నెల్లూరులో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు సాయికుమార్ తదితరులు అవార్డు ప్రదానం చేశారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, విద్యారంగాల్లో రామకృష్ణ చేసిన విశేష కృషికి పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. రామకృష్ణ రచనలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో అనువాదం కావడం, నేపాల్ నుంచి మాతృభాషా రత్న అవార్డు స్వీకరించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ నితిన్‌పాఠక్, టి.రాజయ్య, పరీక్షల నియంత్రణ అధికారి వృక్ష శాస్త్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మల్లారం శ్రీనివాస్‌రెడ్డి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.సత్యప్రకాష్, గణితశాస్త్ర విభాగాధిపతి మధురాజేశ్, తెలుగు విభాగ అధిపతి డాక్టర్ బూర్ల చంద్రశేఖర్, హిందీ విభాగ అధిపతి డాక్టర్ కొమురారెడ్డి, కరుణాకర్, శంకరయ్య, సతీశ్‌కుమార్, సోమ నర్సయ్య, రాపర్తి శ్రీనివాస్, అన్ని విభాగాల అధ్యాపకులు, సిబ్బంది రామకృష్ణకు అభినందనలు తెలిపారు.


