కరీంనగర్‌టౌన్: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ కేంద్రం కరీంనగర్ ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కోటా విద్యాసంస్థల సౌజన్యంతో ఇండియన్ కల్చర్ అండ్ ఫోక్ ట్రెడిషన్స్ లిటరరీ ఫ్లిక్షన్స్ అండ్ పెడగాజికళ్ అప్రోచెస్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ అనే అంశంపై ఆదివారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బీఆర్‌ఏవోయూ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి డా.బి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగా ధిపతి డా.కిషోర్ కుమార్ రెడ్డి కీలకోపన్యాసకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సమన్వయ కేంద్రం ముఖ్య అధికారి ఎం.సత్యప్రకాశ్, కోటా విద్యాసంస్థల ప్రతినిధి సుదర్శన్, ప్యారడైజ్ విద్యాసంస్థల చైర్మన్ పాతిమారెడ్డి, తాళ్లపెల్లి అశోక్, సదస్సు కన్వీనర్ ఎం.వెంకట్ రెడ్డి, సదస్సు కో కన్వీనర్ సీనియర్ అధ్యాపకులు పరుశరామ రావు, కన్నం రమేష్, బి.రాజు, విక్టోరియా రాణి, నాగజ్యోతి, అరుంధతి, కె.రాములు పాల్గొన్నారు.


