కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో అంతరాష్ట్ర కరాటే చాంపియప్‌షిప్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలను హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఒడితెల ప్రణవ్ బాబుతో కలిసి అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణవ్యాప్తంగా సుమారు 450 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటగా వారికి బంగారు, రజతం, కాంస్య పతకాలను ప్రదానం చేసారు. కరాటే ఇన్‌స్ట్రక్టర్ వసంత్ కుమార్, డాక్టర్ తుంగూరి కార్తీక్, కోచ్‌లు, మేనేజర్లు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు.


